ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా షాక్‌లోనుంచి కోలుకోలేదని అన్నారు. పాకిస్థాన్‌లో బాంబులు పేలుతుంటే కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర లేదని విమర్శించారు. బీహార్‌లో కాంగ్రెస్‌ని ఓడించి, బీజేపీని గెలిపించాలని మోదీ ప్రజలను కోరారు.