ఉచిత వైద్యం, విద్య ఇవ్వకపోతే.. అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి: కవిత

20చూసినవారు
ఉచిత వైద్యం, విద్య ఇవ్వకపోతే.. అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి: కవిత
TG: ఉచిత విద్య, వైద్యమే తమ నినాదం అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11 వేల కోట్లు పెండింగ్లో పెట్టి విద్యాసంస్థలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. 'నేను ఆడపిల్లను, ఇచ్చిన మాట తప్పను. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకపోతే నన్ను అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి' అంటూ భావోద్వేగంగా సవాల్ విసిరారు. ఫీజుల దోపిడీపై అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్