
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య (వీడియో)
మహారాష్ట్రలోని పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి తొమ్మిది మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.




