తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 500కు పైగా చిత్రాల్లో నటించినా, 'సికంజ మాలిక్' వంటి భయంకరమైన పాత్రను ఎప్పుడూ చేయలేదని నటుడు మోహన్‌బాబు అన్నారు. 'ది ప్యారడైజ్' ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తెరపై ఇంత హింసాత్మకంగా చూపిస్తారని తెలిస్తే ఆ పాత్రను అంగీకరించేవాడిని కాదని సరదాగా వ్యాఖ్యానించారు. తన జీవితంలో 10 టేకులు చేయించిన దర్శకుడు శ్రీకాంత్ అని అన్నారు. శ్రీకాంత్ ప్రతిభ చూస్తే గర్వంగా ఉందన్నారు.