అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. గుజరాత్‌కు చెందిన ఆర్యన్ అసారీ (18) అనే యువకుడు ఏడాది క్రితం అనుకోకుండా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద దృశ్యాలను తన మొబైల్‌లో బంధించాడు. ఆనాటి భయానక దృశ్యాలు అతన్ని ఇప్పటికి వెంటాడుతూనే ఉన్నాయి. 'ఆ ప్రమాదం తర్వాత నేను మొబైల్‌లో విమానాల వీడియోలు తీయడం ఆపేశాను. నేను రికార్డ్ చేస్తే ఎక్కడ మరో
విమానం కూలిపోతుందోనని భయమేస్తోంది' అని ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో విమానమెక్కే ధైర్యం తనకు లేదని చెబుతున్నాడు.