పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపుమంటతో రగిలిపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

4439చూసినవారు
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపుమంటతో రగిలిపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ల కడుపు మండుతోందని, కల్వకుంట్ల కుటుంబ అవినీతిని చూసి ప్రజలు వారిని బహిష్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని, తాము మాత్రం ఏటా రూ.16 వేల కోట్లతో నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల గురించి పట్టించుకోలేదని, వారు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. 30 నెలల్లోనే రైతుల ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమ చేసి అన్నదాతలకు అండగా నిలిచామని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్