చేతకాక పోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కి అప్పజెప్పాలి: KTR (వీడియో)

0చూసినవారు
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై CM రేవంత్‌ని ఉద్దేశించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర విమర్శలు చేశారు. "100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణ ప్రజలు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. అలాంటి ప్రాజెక్టును నిర్వహించడం మీకు చేతకాకపోతే, తెలివి లేకపోతే కేసీఆర్‌కు అప్పగించండి రేవంత్‌. మొత్తం తెలంగాణలో నీళ్లు పారించి చూపించే బాధ్యత మాది. ఒక్క వారం కేసీఆర్‌కి అప్పజెప్పండి చాలు" అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్