అలా చేయకపోతే 24 గంటల్లోగా రాజీనామా చేస్తా: MLA నాయిని

14చూసినవారు
TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద పక్కాగా RTI ద్వారా సేకరించిన ఆధారాలు ఉన్నాయని,  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే, 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ భారీ భూ కుంభకోణంపై వాస్తవాలు బయటకు రావాలంటే తక్షణమే హౌస్ కమిటీ లేదా CID తో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్