TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే ఓటర్లకు ఈ ఎన్నికల్లో తొలిసారి ‘నన్ ఆఫ్ ద అబౌ(నోటా)’ అవకాశాన్ని ఈసీ కల్పించింది. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్ ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ విధానం ఉంది.