అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వలసదారులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇతర దేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు అమెరికాకు వలస రావడం వల్ల దేశ భవిష్యత్తు ప్రభావితమవుతుందని, పేద దేశాల ప్రజలు వస్తే
అమెరికా కూడా పేదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వలసలను అరికట్టి, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా మార్చుకుందామని ట్రూత్‌లో పోస్టు పెట్టారు. హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేయడాన్ని కూడా ట్రంప్ విమర్శించారు. ఫెడరల్ జడ్జిలు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.