ప్రధాని నరేంద్ర మోదీపై
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ శుక్రవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. 1988లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ యువతకు ఓటు హక్కు కల్పించేందుకు ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రధాని
మోదీ మాత్రం యువత ఓటు హక్కును లాగేసుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 2024 నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను నిలిపివేయడమే దీనికి నిదర్శనమని తెలిపారు.