KKR, RCB మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 11 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచినా 14 పాయింట్లతోనే ఉంటుంది. ప్రస్తుత స్థితిలో 14 పాయింట్లతో టాప్-4లో నిలవడం అసాధ్యం. ఇక, ఈ మ్యాచ్ రద్దయితే బెంగళూరుపై పెద్దగా ప్రభావం ఉండదు. ఆర్సీబీ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.