రైతు భరోసా’ నిధులు మీ ఖాతాలో పడలేదా.. ఇలా చేయండి!

4చూసినవారు
రైతు భరోసా’ నిధులు మీ ఖాతాలో పడలేదా.. ఇలా చేయండి!
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను విడుదల చేస్తోంది. ఈ డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకునేందుకు ముందుగా స్టేటస్ చెక్ చేసుకోవాలి. డబ్బులు పడకపోతే మీ పట్టాదారు పాస్ బుక్, భూమి వివరాలు తీసుకుని మండలం పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. డబ్బులు పడకపోవడానికి గల కారణం తెలుసుకోండి. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించుకోండి. పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒకేలా ఉందా.. లేదా అనేది చెక్ చేస్కోండి. పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశముంది.

సంబంధిత పోస్ట్