TG: మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అప్పుల విషయంలో జూపల్లి చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. నిన్న తెలంగాణపై రూ.8 లక్షల కోట్ల అప్పు ఉందన్న మంత్రి, ఈరోజు రూ.7 లక్షల కోట్లుగా చెబుతున్నారని, ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. చర్చకు వచ్చి ఉంటే అసలు లెక్కలు బయటపడేవని అన్నారు.
కేటీఆర్ సవాల్‌కు స్పందిస్తూ తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి, చివరకు చర్చకు రాకుండా వెళ్లిపోయారని, అతనికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.