ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం.. ఎక్కడంటే?

155చూసినవారు
ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం.. ఎక్కడంటే?
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో వెలసిన శ్రీ నరసింహస్వామి ఆలయం విశిష్టమైనది. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. స్వయంభూగా వెలిసిన ఈ లింగాకార నరసింహునికి శైవ, వైష్ణవ సంప్రదాయాలకు సంకేతంగా అడ్డ, నిలువు నామాలు ఉండటం విశేషం. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ పుష్కరిణిలో స్నానం చేస్తే అనారోగ్యాలు నయమవుతాయని, సంక్రాంతి వేళ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్