TG: హైదరాబాద్ బేగంపేట ప్రాంతానికి చెందిన యువతి (26) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న పనీశ్ (52) పరిచయమయ్యాడు. అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో సదరు యువతి మరో బ్యాంకులో పనిలో చేరింది. అప్పటి నుంచి తరచూ ఆమెకు వాట్సప్‌లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.