
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. బాలుడి మృతి (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. 12వ తరగతి విద్యార్థి కారు అతివేగంగా నడుపుతూ పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. విద్యార్థి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.




