TG: దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావమన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకుని, పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమపై సోయి లేదని,
ఉద్యోగాలు పెంచి
నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ కుర్చీ ఖాళీ చేయడం పక్కా అని నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల మద్దతు పొంది, ఇప్పుడు వారిని పోలీసుల ద్వారా హింసించడం తీవ్రమైన హెచ్చరికగా పరిగణిస్తున్నామని మరో నిరుద్యోగి అన్నారు.