వాట్సప్‌ లేకపోతే.. అరట్టై వాడొచ్చు కదా: సుప్రీం కోర్టు

60చూసినవారు
వాట్సప్‌ లేకపోతే.. అరట్టై వాడొచ్చు కదా: సుప్రీం కోర్టు
వాట్సప్‌నకు పోటీగా రూపొందిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు విచారణలో కూడా దీని పేరు వినిపించింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “వాట్సప్‌ లేకపోతే ఏం.. అరట్టై వాడొచ్చు కదా?” అంటూ సూచించింది. సుప్రీం వ్యాఖ్యలతో ‘అరట్టై’ యాప్‌ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.