అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన అదనపు టారిఫ్‌లపై కేంద్రమంత్రి జై శంకర్ తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా.. భారత్‌పై చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించారు. ‘భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మా రైతులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడమే మాకు ప్రధానం. నిజంగా భారత్‌తో మీకు సమస్య ఉంటే.. మా ప్రొడక్ట్స్ కొనకండి. మిమ్మల్ని కొనమని ఎవరూ బలవంతం చేయట్లేదు’ అని తెలిపారు.