ప్రేమలో పడితే లావెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. సింగిల్స్‌తో పోలిస్తే కమిటెడ్ రిలేషన్‌లో ఉన్నవారు అధిక బరువు పెరుగుతున్నట్లు మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మహిళల్లో ఏడాదిలోనే ఊబకాయం ప్రమాదం పెరుగుతుండగా, పురుషుల్లో ఇది రెండేళ్ల తర్వాత కనిపిస్తోందట. కలిసి తినడం, ఎక్కువ కేలరీలు తీసుకోవడం, డైట్-వ్యాయామంపై దృష్టి తగ్గడం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉన్నా, అసంతృప్తిగా ఉన్నా జంటలు బరువు పెరగడం సాధారణమేనని అధ్యయనం సూచిస్తోంది.