ఈ టెంపుల్‌కి వెళ్తే అమ్మవారిని తిట్టాల్సిందే.. అదెక్కడో తెలుసా?

0చూసినవారు
ఈ టెంపుల్‌కి వెళ్తే అమ్మవారిని తిట్టాల్సిందే.. అదెక్కడో తెలుసా?
కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయంలో ఏటా జరిగే 7 రోజుల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో భక్తులు కత్తులతో ఆలయంలోకి ప్రవేశించి, తమ తలపై దాడి చేసుకుని, రక్తాన్ని ప్రవహింపజేస్తారు. భద్రకాళీ అమ్మవారిని తిట్ల దండకంతో పాటు భక్తి గీతాల రూపంలోనూ తిట్టిపోస్తారు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు, దీనివల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం వంటి సంప్రదాయ పూజలు ఉండవు. ఉత్సవాలు ముగిసిన వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి, రక్తపు మరకలను శుభ్రం చేస్తారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్