హోలి వేళ మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రతికూల శక్తులను తరిమికొడితే శ్రేయస్సు కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చిరిగిన పాత బట్టలు, పగిలిన అద్దాలు, వాడిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే పాత చెప్పులు, పనిచేయని విద్యుత్ పరికరాలు, విరిగిన దేవుడి విగ్రహాలు కూడా ఆర్థిక, మానసిక ఇబ్బందులకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. హోలీకి ముందు వీటిని తొలగించడం లేదా దానం చేయడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తున్నారు.