ఇంటి పరిసరాల్లో సర్వగంధ, లెమన్రాస్, బంతిపూలు, వెల్లుల్లి, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలను పెంచడం ద్వారా పాముల రాకను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కల ఘాటైన వాసన పాములకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు. స్నేక్ ప్లాంట్ ఆకృతి పాములను భయపెట్టేలా ఉంటుందని చెబుతున్నారు. స్నేక్ ప్లాంట్ మొక్కలతో మరో లాభం ఉంది. ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసి గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.