తప్పు చేయకుంటే ఎందుకు ఆపుతున్నారు: హరీష్ రావు

14చూసినవారు
తప్పు చేయకుంటే ఎందుకు ఆపుతున్నారు: హరీష్ రావు
TG: గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బ్రోకర్లకు, డ్రగ్స్ సప్లయర్లకు టెండర్లు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పారిపోయిందని విమర్శించారు. తప్పు చేయకుంటే ఎందుకు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా నిరూపిస్తామని, తాము గొడవలకు కాకుండా చర్చకే వెళ్తున్నామని తెలిపారు. ముగ్గురు మంత్రులే తనను రమ్మన్నారని, మళ్లీ ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్