రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా

33చూసినవారు
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా
‘ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన’ పథకం కింద ఏడాదికి రూ.20 కడితే రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు. దీనికోసం ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. బ్యాంకులో ఈ స్కీమ్‌కు సంబంధించిన ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి ఏడాది మే నెలలో మీ బ్యాంకు ఖాతాలో నుంచి రూ.20 ఆటో డెబిట్ అవుతాయి. ఈ పథకానికి 18-70 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు అర్హులు. యాక్సిడెంట్‌లో చనిపోయినా.. పూర్తిగా అంగవైకల్యానికి గురైనా నామినీకి రూ.2 లక్షలు అందుతాయి.

సంబంధిత పోస్ట్