మాతో పెట్టుకుంటే పళ్ళు రాలతాయి’.. జనసేన నేతలకు కవిత వార్నింగ్

13చూసినవారు
హైదరాబాద్‌లో జూన్ 2న జనసేన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ జరగనున్న నేపథ్యంలో TRS పార్టీ అధ్యక్షురాలు కవిత ఘాటుగా స్పందించారు. తెలంగాణ మేధావులను ఆంధ్రా పోలీసులతో బెదిరిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే నేరుగా పోటీ పడాలని పవన్‌ కల్యాణ్‌కు సవాల్ విసిరిన ఆమె, తెలంగాణలో అనవసర రాజకీయ పంచాయితీలు చేస్తే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. “మాతో పెట్టుకుంటే పళ్లు రాలతాయి” అంటూ జనసేన నేతలకు కవిత హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్