చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి?

48చూసినవారు
చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి?
చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ సరిగ్గా పనిచేసి త్వరగా నిద్రపడుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం, మొబైల్-టీవీ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే స్క్రీన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే గది ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. శ్వాస వ్యాయామాలు, యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా గాఢ నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్