చర్మ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికి ఉదాహణే మొటిమల సమస్య. వీటిని తగ్గించేందుకు ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాంటున్నారు. చేపలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్‌నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. చర్మకాంతిని మెరుగుపరచడంలో గ్రీన్ టీ కీలకపాత్ర పోషిస్తుంది.