
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్కు చెందిన యువన్చంద్ర, సతీష్.. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను.. మరియు ఉరవకొండకు చెందిన సంధ్య నదిలో కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు.




