
బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆ క్రికెటర్ సోదరి
బిగ్ బాస్ 19 హౌస్‌లోకి టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి, నటి, మోడల్ మాళతి చాహర్ రెండవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమో వీడియో షోపై అంచనాలను పెంచింది. సల్మాన్ ఖాన్ స్టేజ్ పైన దీపక్ చాహర్‌ను స్వాగతించిన తర్వాత మాళతి ఎంట్రీ ఉండనుంది. సల్మాన్ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు చాహర్ నాకు తెలిసి ఈ షో క్రికెట్ కంటే కష్టమని ఇక్కడ మీ శత్రువు ఎవరో, మీ స్నేహితుడు ఎవరో మీకు తెలియదు అని సమాధానం ఇచ్చారు.




