ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో తాను చూసిన ఎగిరే చేప వీడియోను షేర్ చేశారు. అయితే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ స్పందిస్తూ, అది నిజమైన చేప కాదని, ఏఐ ద్వారా రూపొందించిన వీడియో అని స్పష్టం చేశారు. దీంతో ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏఐ వల్ల వాస్తవాలు, ఊహాజనితాలను గుర్తించడం కష్టమవుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.