దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన IIT బాంబే విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసులో సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. అందులో, అతను ఫోన్ ఉపయోగిస్తూ పరీక్ష రాస్తున్నట్లు కనిపించింది. ప్రొఫెసర్ సూర్య నారాయణ అతన్ని బయటకు తీసుకెళ్లడం కూడా రికార్డయింది. మరణానికి ముందు, అతను తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి తాను తప్పు చేసినట్లు చెప్పినట్లు సమాచారం. అయితే, తమ కుమారుడి ఆత్మహత్యకు కుల వివక్షే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.