ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

49చూసినవారు
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించడం, కుల వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అధికారులు సెలవుపై పంపినట్లు సమాచారం. ఈ కేసులో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధితుల కుటుంబం ఆరోపణలు, ఐఐటీ బాంబే వివరణలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్