TG: వరిధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్‌ఛార్జ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్‌ఛార్జ్‌గా కొప్పుల సైదులు విధలు నిర్వహిస్తున్నాడు. అయితే కొనుగోలు విషయంలో ఒత్తిడి చేస్తున్నారని, ధాన్యం లోడుతో వెళ్లిన లారీలు అన్‌లోడ్ కావడంలేదని తెలిపాడు. నా ఆత్మహత్యతోనైనా కొనుగోళ్లు సజావుగా సాగాలంటూ పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.