సంగీత దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు
ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్ ప్రత్యేకంగా సత్కరించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో
ఆస్ట్రేలియా పోస్ట్ సంస్థ ఇళయరాజా చిత్రంతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. విక్టోరియా ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగన్ ఎంపీ స్టాంపులను ఆవిష్కరించారు. ఈ గౌరవంపై ఇళయరాజా కృతజ్ఞతలు తెలిపారు.