
అరెస్టైన వారిలో పార్టీ అగ్ర నేతలు లేరు - మావోయిస్టులు
మావోయిస్టులు విడుడల చేసిన లేఖలో ఇంకో విషయం బయటపడింది. కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంపై కూడా ప్రస్తావించారు. ఈ ఇద్దరు పోలీసుల అదుపులో లేరని తేల్చి చెప్పారు. అలాగే వాళ్ళు తమ ప్రాణాలను కాపుడుకోవటానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పేర్కొన్నారు. హిడ్మా గురించి దేవ్ జీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు.




