గాంధీ జయంతి నాడు అక్రమ మద్యం విక్రయం.. ఒకరి అరెస్ట్!

5చూసినవారు
గాంధీ జయంతి నాడు అక్రమ మద్యం విక్రయం.. ఒకరి అరెస్ట్!
గాంధీ జయంతి (డ్రై డే) సందర్భంగా వైన్ షాపులు మూతపడటాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన అర్జున్ సింగ్ (29)ను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేబర్ అడ్డా సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.రంగస్వామి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6 ప్రెస్టీజ్ విస్కీ, 14 ఆఫీసర్స్ ఛాయిస్ బాటిళ్లు (మొత్తం 2.40 లీటర్ల IMFL మద్యం) సీజ్ చేశారు. తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, సెలవును ఆసరాగా చేసుకుని అధిక ధరకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్