AP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద ZPHS స్కూల్లో సోమవారం డ్రాయింగ్ ఉపాధ్యాయుడు శ్రీను తన సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొబ్బరి కాయను నిలువుగా కట్ చేసి, దేవునికి సమర్పించే చిప్పలోనే గణనాథుడి రూపాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడి ఈ వినూత్న ఆలోచన, కళాత్మక నైపుణ్యాన్ని స్థానికులు, పాఠశాల
విద్యార్థులు ఎంతగానో కొనియాడుతున్నారు.