
క్రెడిట్ కార్డ్ బిల్లులో తప్పుడు ఛార్జీలుంటే ఫిర్యాదు చేయండిలా!
మీ క్రెడిట్ కార్డ్ బిల్లులో తెలియని లావాదేవీలు లేదా తప్పుడు ఛార్జీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. RBI నిబంధనల ప్రకారం.. బిల్లింగ్ వివాదాల గురించి 3 పనిదినాల్లోగా బ్యాంకుకు సమాచారం అందిస్తే, ఆ ఆర్థిక బాధ్యత వినియోగదారులపై ఉండదు. ఫిర్యాదును పరిష్కరించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాలి. ఒకవేళ బ్యాంకు ఫిర్యాదును తిరస్కరిస్తే, RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. మీ OTP, PIN, CVV లేదా కార్డ్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.




