తెలంగాణలో జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డుల అమలు ప్రారంభం

22చూసినవారు
తెలంగాణలో జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డుల అమలు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు రానున్నాయి. ఆధార్ కార్డుకు బదులుగా త్వరలో ప్రత్యేక మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 2 నుంచి దశలవారీగా అమలు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదట కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, సమస్యలు పరిష్కరించాక రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. స్మార్ట్ కార్డులు అందరికీ చేరే వరకు ఆధార్ ఆధారిత విధానం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్