ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆండ్రాయిడ్ 12, పాత వెర్షన్లకు గూగుల్ షాక్: సెక్యూరిటీ అప్‌డేట్‌లు నిలిపివేత
Feb 08, 2026, 11:02 IST/

ఆండ్రాయిడ్ 12, పాత వెర్షన్లకు గూగుల్ షాక్: సెక్యూరిటీ అప్‌డేట్‌లు నిలిపివేత

Feb 08, 2026, 11:02 IST
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఎక్కువమంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే, గూగుల్ తాజాగా ఆండ్రాయిడ్ 12, అంతకంటే పాత వెర్షన్లను వాడుతున్న వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వెర్షన్లకు ఇకపై సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం కేవలం 58 శాతం మంది మాత్రమే ఆండ్రాయిడ్ 13, అంతకంటే ఎక్కువ వెర్షన్లను వాడుతున్నారు. ఆండ్రాయిడ్ 9 నుంచి 12 వరకు వాడుతున్నవారు సైబర్ దాడులు, హ్యాకింగ్, మాల్వేర్ దాడుల బారిన పడే ప్రమాదం ఉంది. యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ చోరీ, బ్యాంకింగ్ యాప్స్ హ్యాకింగ్ వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.