రాజ్‌కోట్‌లో
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత యువ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. యశ్‌వర్ధన్ చౌహాన్ (122) శతకంతో చెలరేగగా, వీకే వినీత్ (87), ఆర్యవీర్ సెహ్వాగ్ (47), కుశాగ్ర ఓఝా (34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి వన్డేలో విజయం సాధించిన
భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.