
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బాస్మతి బియ్యం ఎగుమతులపై ఆందోళన
ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అమెరికా జోక్యం భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 72% మధ్యప్రాచ్య దేశాలకే వెళ్లడంతో అస్థిరతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2024–25లో భారత్ 60.65 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసి రూ.50,312 కోట్లు ఆర్జించగా, అందులో రూ.36,139 కోట్లు మధ్యప్రాచ్య దేశాల నుంచే వచ్చాయి. సరుకులు నిలిచిపోవడం, చెల్లింపుల ఆలస్యంతో ఎగుమతిదారులు కేంద్ర జోక్యం కోరుతున్నారు.




