పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మునీర్ ను నియంతగా, మానసికంగా అస్థిరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఈ ఏడాది మే 9, నవంబర్ 26 తేదీలలో జరిగిన సంఘటనలను, పోలీసుల కాల్పుల్లో పార్టీ కార్యకర్తల మరణాలను ఖండించారు. తన భార్య బుష్రా బీబీని అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 2023 నుండి పలు కేసుల్లో జైలులో ఉన్న ఇమ్రాన్, ఇదంతా మునీర్ కావాలనే చేస్తున్నారని తెలిపారు.