
3 గంటల్లోనే కంటెంట్ డిలీట్.. కేంద్రం కొత్త రూల్
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ఐటీ నిబంధనలను కఠినతరం చేసింది. అక్రమ కంటెంట్‌ను నోటీసు అందిన 3 గంటల్లోనే తొలగించాలని ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిన కంటెంట్‌కు లేబులింగ్ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో, కాశ్మీర్ పెల్లెట్ కథనాలకు సంబంధించిన Scroll.in, The Hindu పోస్టులను మెటా భారత్‌లో బ్లాక్ చేసింది. డీప్‌ఫేక్‌లను నియంత్రించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




