హిందూ మతంలో పూజలో అగరబత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. అగరబత్తులు వెలిగించడం శుభప్రదమని, ఇది దేవతలను సంతోషపెట్టి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. ఒక అగరబత్తిని వెలిగించడం అసమతుల్యతకు చిహ్నంగా భావిస్తారు. మూడు అగరబత్తులు త్రిమూర్తులను సూచిస్తాయి. నాలుగు అగరబత్తులు నాలుగు దిశలలో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తాయి. పూజ ప్రారంభించే ముందు రెండు లేదా నాలుగు అగరబత్తులను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి.