ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ... పోలీసుల కాల్పులు
Jun 15, 2026, 02:06 IST/

సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ... పోలీసుల కాల్పులు

Jun 15, 2026, 02:06 IST
AP: తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళ్తున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటాక దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్‌ లాగడంతో రైలు ఆగగా, దొంగలు పొలాల మీదుగా పారిపోతుండగా రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.