పెరిగిన చలి.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

55చూసినవారు
పెరిగిన చలి.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు తెలిపింది. శుక్ర, శనివారాల్లో చలి గాలులు వీచే అవకాశముందని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.

ట్యాగ్స్ :