కమర్షియల్ సిలిండర్ ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెలలో వాణిజ్య గ్యాస్ బండ ధరలు పెరగడంతో టిఫిన్ సెంటర్లలో ధరలు రూ.5-15 వరకు పెరిగాయి. రెస్టారెంట్లలో కూడా ధరలు పెరిగాయి. తాజా ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడనుంది. ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్ పై కాకుండా కమర్షియల్ సిలిండర్ పై ధరలు పెంచుతున్నామని చెబుతున్నా, అంతిమంగా భారం సామాన్యుడిపైనే పడుతోంది.